Kartik Aryan : షారుఖ్ పఠాన్ కలెక్షన్స్ కోసం రిలీజ్ ని వాయిదా వేసుకున్న మరో స్టార్ హీరో..

పఠాన్ సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు, రిలీజ్ తర్వాత కూడా వేరే ఏ సినీ పరిశ్రమలలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ లో అయితే పఠాన్ కోసం ఉన్న సినిమాలన్నీ వాయిదా వేశారు. గత సంవత్సర కాలంగా అందరూ బాలీవుడ్ ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాక రాక వచ్చిన పెద్ద హిట్ సినిమాని...............

Kartik Aryan : షారుఖ్ పఠాన్ కలెక్షన్స్ కోసం రిలీజ్ ని వాయిదా వేసుకున్న మరో స్టార్ హీరో..

Kartik Aryan Shehzada postponed for Pathaan collections

Kartik Aryan :  షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా మొదటి నుంచి కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఆరు రోజుల్లో 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 300 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

పఠాన్ సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు, రిలీజ్ తర్వాత కూడా వేరే ఏ సినీ పరిశ్రమలలో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ లో అయితే పఠాన్ కోసం ఉన్న సినిమాలన్నీ వాయిదా వేశారు. గత సంవత్సర కాలంగా అందరూ బాలీవుడ్ ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాక రాక వచ్చిన పెద్ద హిట్ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని బాలీవుడ్ వాళ్లంతా కలిసి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే 600 కోట్లు వసూలు చేసిన సినిమాని 1000 కోట్ల వరకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ఏ సినిమాలు రిలీజ్ కి లేకపోవడం కూడా పఠాన్ కి కలిసొచ్చింది. అందుకే మరో 2 వారాల పాటు బాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు. దీంతో మరో స్టార్ హీరో సినిమా కూడా వాయిదా వేసుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా రోహిత్ ధావన్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన సినిమా షెహజాదా. ఇది మన తెలుగు అలవైకుంఠపురంలో సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణంలో గీత ఆర్ట్స్, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ కూడా పాలుపంచుకున్నాయి.

Pathaan Collections : ఆరు రోజుల్లో 600 కోట్లు.. వీక్ డేస్ లో కూడా పఠాన్ వసూళ్లు తగ్గట్లేదుగా..

ఇప్పటికే ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడింది. ఇటీవల ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు పఠాన్ వల్ల అది కూడా వాయిదా పడింది. పఠాన్ కోసం బాలీవుడ్ అంతా ఒక్కటవడంతో కార్తీక్ ఆర్యన్ షెహజాదా సినిమాని మరోసారి వాయిదా వేశారు. షెహజాదా సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తామని కొత్త డేట్ ని ప్రకటించారు. మొత్తానికి షారుఖ్ పఠాన్ కి మరింత కలెక్షన్స్ తెప్పించడానికి బాలీవుడ్ తెగ ప్రయత్నిస్తుంది.