KGF Actor Harish Rai : కేజీయఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక.. ఆదుకునేవాళ్లే లేరా..?

యశ్ పాత్రకి బాగా క్లోజ్ గా ఉండే ఖాసిం చాచాగా నటించిన వ్యక్తి నటుడు హరీశ్‌ రాయ్‌. పలు కన్నడ సినిమాల్లో నటించిన హరీష్ రాయ్ కేజీయఫ్ సినిమాతో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే హరీష్ రాయ్ గత కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల హరీశ్‌రాయ్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..................

KGF Actor Harish Rai :  కేజీయఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక.. ఆదుకునేవాళ్లే లేరా..?

KGF Actor Harish Rai rffected with cancer and seeing for helping

KGF Actor Harish Rai :  యశ్‌ హీరోగా నటించిన ‘కేజీయఫ్’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాలో యశ్ పాత్రకి బాగా క్లోజ్ గా ఉండే ఖాసిం చాచాగా నటించిన వ్యక్తి నటుడు హరీశ్‌ రాయ్‌. పలు కన్నడ సినిమాల్లో నటించిన హరీష్ రాయ్ కేజీయఫ్ సినిమాతో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు.

అయితే హరీష్ రాయ్ గత కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల హరీశ్‌రాయ్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”మూడేళ్లుగా నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. ‘కేజీయఫ్‌’లో నేను గడ్డంతో కనిపించడానికి కూడా క్యాన్సర్ కారణం. క్యాన్సర్‌ కారణంగా నా గొంతు వాచిపోయింది. దాన్ని కనపడనీయకుండా ఉండేందుకు గడ్డం పెంచాను. క్యాన్సర్‌ అని గుర్తించిన వెంటనే దానికి కావాల్సిన చికిత్సకు, మందులకు నా దగ్గర డబ్బులు లేక సర్జరీ వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది. రోజురోజుకీ నా పరిస్థితి మరింత దిగజారుతోంది. తెలిసిన వాళ్ళని, ఇండస్ట్రీ వాళ్లని సహాయం అడుగుదామని వీడియో రికార్డు చేశాను కానీ ఎందుకో పోస్ట్‌ చేయడం ఇష్టంలేక వదిలేశాను” అని తెలిపారు.

Director Bobby : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో విషాదం.. సంతాపం తెలుపుతున్న సినీ పెద్దలు..

అయితే హరీష్ రాయ్ కి కేజీయఫ్ చేస్తున్నప్పటి నుంచే క్యాన్సర్ ఉన్నా చెప్తే అవకాశాలు రావేమో అని చెప్పలేదని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి కొంతమంది కన్నడ నటులు వారికి తోచినంత సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కేజీయఫ్ టీం నుంచి ఒక్కరు కూడా హరీష్ రాయ్ క్యాన్సర్ పై స్పందించకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాలో హరీష్ రాయ్ పాత్ర చాలా సపోర్ట్ చేసిందని, అతనికి సహాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.