Sudeep : బ్రేక్ తీసుకోలే.. వచ్చింది అంటున్న కిచ్చా సుదీప్.. కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్!

కిచ్చా సుదీప్ (Sudeep) గత ఏడాది 'విక్రాంత్ రోణ' (Vikrant Rona) వంటి పాన్ ఇండియా హిట్ తరువాత ఇంకో సినిమా అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. తాజాగా వీటి పై కిచ్చా సుదీప్ రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశాడు.

Sudeep : బ్రేక్ తీసుకోలే.. వచ్చింది అంటున్న కిచ్చా సుదీప్.. కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్!

Source Twitter - Kichcha Sudeep

Sudeep : శాండిల్‌వుడ్ కింగ్ కిచ్చా సుదీప్ (Sudeep) గత ఏడాది ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ ఫిలింగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సుదీప్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సుదీప్ మరో సినిమా ప్రకటించలేదు.

Kichha Sudeep : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది..

45 సినిమాలు గ్యాప్ లేకుండా చేస్తూ వచ్చిన సుదీప్.. 46వ చిత్రం అనౌన్స్ చేయడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం, అదికూడా విక్రాంత్ రోణ వంటి పాన్ ఇండియా హిట్ తరువాత తీసుకోవడంతో అభిమానులు ఫీల్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అనేక పోస్ట్ లు వేస్తున్నారు. తాజాగా వీటి పై కిచ్చా సుదీప్ రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశాడు. “Kichcha46 పై మీరు చేసే ట్వీట్స్ అండ్ మీమ్స్ చూస్తుంటే నాకు అర్ధమవుతుంది.. నా పై మీరు ఎంత ప్రేమాభిమానం చూపిస్తున్నారో. అందుకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను.

Tillu Square : టిల్లు కోసం మహేష్‌ సినిమాని వెనక్కి తీసుకెళ్లిన నిర్మాత.. మెగాస్టార్‌కి పోటీ?

అవును నేను బ్రేక్ తీసుకున్నాను. నా కెరీర్ లో ఇదే మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ సినిమాని కోవిడ్ వంటి బ్యాడ్ టైంలో చాలా కష్టపడి తెరకెక్కించాం. అలాగే బిగ్‌బాస్ 5 టీవీ అండ్ ఓటిటి సిరీస్ కోసం గ్యాప్ లేకుండా షూట్ చేశాం. దీంతో కొంచెం గ్యాప్ అవసరం అనిపించింది. ఇక ఈ బ్రేక్ ని క్రికెట్ తో బాగా ఎంజాయ్ చేశాను. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) లో కర్ణాటక బుల్ డోజర్స్ (Karnataka Bulldozers) తో చాలా హ్యాపీ టైం స్పెండ్ చేశా.

ఇక నా సినిమా ప్రాజెక్ట్స్ విషయాలకు వస్తే.. ప్రతిరోజు నా కొత్త సినిమాల కోసం స్క్రిప్ట్ లు వింటూనే ఉంటున్నా. ఆల్రెడీ 3 కథలను ఓకే చేశాను. ప్రస్తుతం ఆ కథల స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించిన చిత్ర యూనిట్స్ డే అండ్ నైట్ కష్ట పడుతున్నారు” అంటూ చెప్పు కొచ్చాడు. ఇక ఈ నోట్ చూసిన కిచ్చా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కిచ్చా తన తదుపరి ప్రాజెక్ట్స్ ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీసుకు వస్తున్నాడా? లేదా? అన్నది చూడాలి.