Nikesha Patel: “నీ వెంట నేను నడుస్తా”…పవన్ ట్వీట్ కి కొమరం పులి హీరోయిన్ రీ ట్వీట్..
విశాఖపట్నం వేదికగా ఈ శనివారం సాయంత్రం నుంచి పొలిటికల్ హీట్ నెలకుంది. జనవాణి కార్యక్రమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకోగా, ఇందుకు అనుమతి లేదంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పవన్ ని నిర్వీర్యంచే ప్రయత్నం చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ నుంచే ట్విట్టర్ వేదికగా పోలీసులుపై పొలిటికల్ సెటైర్లు సంధిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్..

Komaram Puli Heroine Nikesha Patel Re Tweet on Pawan Kalyan Tweet
Nikesha Patel: విశాఖపట్నం వేదికగా ఈ శనివారం సాయంత్రం నుంచి పొలిటికల్ హీట్ నెలకుంది. జనవాణి కార్యక్రమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకోగా, ఇందుకు అనుమతి లేదంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ పవన్ ని నిర్వీర్యంచే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జనసేనాని ప్రముఖ నోవోటల్ హోటల్ లో నిర్బంధం చేయగా, కొందరి జనసేన ముఖ్య నేతలను కూడా అరెస్ట్ చేశారు.
దీంతో పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ నుంచే ట్విట్టర్ వేదికగా పోలీసులుపై పొలిటికల్ సెటైర్లు సంధిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్.. “నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆర్‌కె బీచ్‌లో సాయంత్రం అలా నడుస్తూ, స్వచ్ఛమైన గాలి పీల్చడానికి నాకు అనుమతి ఉందా?” అంటూ ట్వీట్ చేయగా, దీనికి మెగాబ్రదర్ నాగబాబు.. లెట్స్ గో బ్రదర్, నేను వస్తా నీతో అంటూ రీ ట్వీట్ చేశాడు.
కాగా తాజాగా పవన్ సినిమా ‘కొమరం పులి’లో నటించిన హీరోయిన్ నికేష పటేల్ కూడా జనసేన ట్వీట్ కి స్పందించింది. “నీ వెంట నేను నడుస్తా” అంటూ తన సినిమా హీరోకి రిప్లై ఇచ్చింది. ఇక పవన్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని రీ ట్వీట్స్ చేస్తూ ట్రేండింగ్ లో పెడుతున్నారు.
I’ll walk with you! https://t.co/thdrziuml3
— Nikesha Patel (@NikeshaPatel) October 16, 2022