KS Nageswararao : టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడి మృతి.. శోకసంద్రంలో శ్రీహరి కుటుంబం

తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మరణించారు. నిన్న శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ కి.........

KS Nageswararao : టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడి మృతి.. శోకసంద్రంలో శ్రీహరి కుటుంబం

Sreehari

KS Nageswararao :  గత కొద్దికాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మరణించారు. నిన్న శుక్రవారం సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న హైదరాబాద్ కి వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వరరావుకి ఫిట్స్ వచ్చాయి దాంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ రెండు, మూడు హాస్పిటల్స్ కి తరలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ సమయానికి వైద్యం అందకపోవడంతో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

Bigg Boss 5 : తండ్రి లేని కూతురని దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని మీ అమ్మకు చెప్పు

నాగేశ్వరరావు మరణం గురించి ఆయన కుమారుడు మాట్లాడుతూ ఫిట్స్ కారణంగా తన తండ్రి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు అని తెలిపాడు. నాగేశ్వరరావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. దర్శకుడు నాగేశ్వరరావు మృతదేహాన్ని వాళ్ళ అత్తగారి నివాసమైన కవులూరు గ్రామంలో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నాగేశ్వరరావు కుమారుడు వెల్లడించారు. ఆయన మరణ వార్త విని టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Bigg Boss 5 : తల్లిని దీప్తి సునైనా గురించి మరీ మరీ అడిగిన షణ్ను

1986 నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న నాగేశ్వరరావు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ అనే సినిమా చేశారు. రెండు సినిమాలు మంచి హిట్ అవడంతో ఆ తర్వాత వరుసగా శ్రీహరితో ‘శ్రీశైలం’, ‘సాంబయ్య’, లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత వైజయంతి, రా, బిచ్చగాడా మజాకా వంటి మరికొన్ని సినిమాలు చేశారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేయడంతో పాటు, ఆయనతో మూడు సినిమాలు చేయడంతో వాళ్ళ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉండేవారు. దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మరణించారని తెలిసి శ్రీహరి కుటుంబం విచారం వ్యక్తం చేసింది.

Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

ఇటీవలే వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో ఓ సినిమాను ప్రారంభించారు. కానీ ఆ మూవీ ఇంకా పూర్తి కాకముందే ఆయన ఇలా హఠాన్మరణం పాలవ్వడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.