Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

'భీమ్లా నాయక్' సినిమాకు 106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 12 రోజుల్లో దాదాపు 95 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. మరో 12 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ ఈ సినిమా.........

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

Radheshyam (1)

 

Radheshyam :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ భారీగానే వచ్చాయి. అయితే ఈ సినిమా దాదాపు 106 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని దాటింది. ఇక ‘రాధేశ్యామ్’ రావడంతో ఓవర్సీస్ లో దాదాపు 95 శాతం థియేటర్స్ లో ‘భీమ్లా నాయక్’ని తీసేశారు. 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో ‘భీమ్లా నాయక్’ థియేట్రికల్ రన్ ముగిసింది.

‘భీమ్లా నాయక్’ సినిమాకు 106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 12 రోజుల్లో దాదాపు 95 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. మరో 12 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించదు. ఏపీలో టికెట్స్ ధరలు తక్కువ ఉండటం ఈ సినిమాకి బాగా మైనస్ అయింది. దానివల్లే దాదాపు 10 కోట్ల కలెక్షన్స్ ని నష్టపోయింది సినిమా. మొదటి వారంలో భీమ్లా నాయక్ కలెక్షన్స్ బాగానే వచ్చిన రెండో వారంలో ఈ కలెక్షన్స్ తగ్గిపోయాయి.

Radheshyam : రాధేశ్యామ్ సినిమాలో వాటికే 75 కోట్లు ఖర్చు..

ఇక ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ ప్రయాణానికి ఎండ్ కార్డ్ పడింది. ఇప్పటికే రాధేశ్యామ్ రావడంతో సింగిల్ స్క్రీన్స్ లో భీమ్లా నాయక్ ని తీసేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కేవలం మల్టీప్లెక్స్ లలో మాత్రమే భీమ్లా నాయక్ ఆడుతుంది. దీంతో బ్రేక్ ఈవెన్ కి వచ్చే కలెక్షన్స్ వచ్చేలా కనపడట్లేదు. ఈ లెక్కలతో కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. ఇక హిందీలో ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా రిలీజ్ చేయలేదు. దానివల్ల కూడా ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ తగ్గాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ మీదే నిర్మాతలు ఆధారపడ్డారు.