Hero Vijay: రీల్ హీరోలు రియల్ హీరోలుగా ప్రవర్తించాలి -మద్రాస్ హైకోర్టు

నటీనటులు నిజమైన హీరోలలా ప్రవర్తించాలని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో నీతి చెప్పేవాళ్లు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటించేవాళ్లు.. నిజజీవితంలో మాత్రం అలా ఎందుకు వ్యవహరించట్లేదని ప్రశ్నించింది.

Hero Vijay: రీల్ హీరోలు రియల్ హీరోలుగా ప్రవర్తించాలి -మద్రాస్ హైకోర్టు

Vijay

Behave like real hero, not reel hero: నటీనటులు నిజమైన హీరోలలా ప్రవర్తించాలని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో నీతి చెప్పేవాళ్లు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటించేవాళ్లు.. నిజజీవితంలో మాత్రం అలా ఎందుకు వ్యవహరించట్లేదని ప్రశ్నించింది.

2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ నటుడు విజయ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేయగా.. ఈ కేసులో విజయ్‌కి రూ. లక్ష ఫైన్ వేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధికి లక్ష రూపాయలను చెల్లించాలంటూ ఆదేశించింది హైకోర్టు. జస్టిస్ ఎస్.ఎం.సుబ్రమణ్యం తన ఉత్తర్వులలో రీల్ హీరోలు రియల్ లైఫ్‌లో కూడా హీరోలుగా ఉండాలని సూచించారు. తమ పన్నులను వెంటనే చెల్లించేవారే నిజమైన హీరోలని చెప్పారు.

ప్రతి పౌరుడు ప్రభుత్వ విధులను సక్రమంగా చెల్లించాల్సిన అవసరం ఉందని, పన్ను చెల్లింపులను తప్పనిసరిగా చెయ్యాలని, పన్ను కట్టడం అనేది స్వచ్ఛంద చెల్లింపు లేదా విరాళం కాదని అన్నారు. పన్నులు కరెక్ట్‌గా కట్టడం వల్ల పేదలు, రైల్వేలు, ఓడరేవులు మరియు పాఠశాలలు, ఆసుపత్రులు మరియు గృహనిర్మాణ ప్రాజెక్టులను నిర్మించడానికి రాష్ట్రానికి సహాయపడతాయని చెప్పారు.

తాను దాఖలు చేసిన పిటిషన్‌లో నటుడు తన వృత్తిని కూడా పేర్కొనలేదని విమర్శించిన న్యాయమూర్తి, “పిటిషనర్ తన వృత్తి లేదా వృత్తిని తన అఫిడవిట్‌లో కూడా పేర్కొనకపోవడం ఆశ్చర్యకరం. విజయ్‌ను ఇంగ్లాండ్ నుండి ప్రతిష్టాత్మక ఖరీదైన కారును దిగుమతి చేసుకున్నాడు. కానీ, చట్టాల ప్రకారం ఎంట్రీ టాక్స్ చెల్లించలేదు. పన్ను చెల్లించకుండా ఉండటానికి అతను రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.”అని అన్నారు.