Guntur Kaaram Update : మహేష్ బాబు గుంటూరు కారం అప్డేట్.. పండక్కే ఫస్ట్ సాంగ్..

గుంటూరు కారం సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు.

Guntur Kaaram Update : మహేష్ బాబు గుంటూరు కారం అప్డేట్.. పండక్కే ఫస్ట్ సాంగ్..

Mahesh Babu Guntur Kaaram Movie First Song Update by Producer Naga Vamsi

Updated On : September 27, 2023 / 8:58 AM IST

Guntur Kaaram Update :  మహేష్ బాబు(Mahesh Babu) సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ మూడో సారి జత కడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కాని గుంటూరు కారం సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు.

ఎప్పుడో మహేష్ బాబు పుట్టిన రోజుకి కూడా కేవలం పోస్టర్ తో సరిపెట్టేశారు. ఈ సినిమా వాయిదా పడుతున్నందుకు, ఎలాంటి అప్డేట్స్ లేనందుకు మహేష్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక గుంటూరు కారం సినిమాని సంక్రాతికి జనవరి 12 రిలీజ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మ్యాడ్ సినిమా ఈవెంట్ లో నిర్మాత నాగవంశీని గుంటూరు కారం సినిమా గురించి, ఫస్ట్ సాంగ్ అప్డేట్స్ గురించి పలువురు విలేఖర్లు ప్రశ్నించారు.

Also Read : Naga Vamsi : మహేష్ గుంటూరు కారం.. రాజమౌళి సినిమాల కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది.. బాబు తగ్గేదేలే..

నిర్మాత నాగవంశీ మహేష్ గుంటూరు కారం సినిమా అప్డేట్స్ గురించి స్పందిస్తూ.. ఇంకా ఏం అనుకోలేదు. ఫస్ట్ సాంగ్ డేట్ అయితే అనుకోలేదు కాని దసరా పండగ ముందు రిలీజ్ చేయొచ్చు అని అన్నారు. దీంతో గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ దసరా పండగ ముందు కాని దసరాకి కాని ఉండొచ్చని తెలుస్తుంది. ఈ విషయం తెలియడంతో మహేష్ అభిమానులు పండక్కి గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.