Ashok Galla : ప్రశాంత్ వర్మ కథతో.. మహేష్ మేనల్లుడి సినిమా..

టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు కుటుంబం నుంచి పరిచమైన మరో హీరో 'అశోక్ గల్లా'. గత ఏడాది 'హీరో' అనే సినిమాతో వెండితెరకు పరిచమయ్యాడు ఈ యువ హీరో. దాదాపు ఏడాది తరువాత ఇప్పుడు తన రెండో సినిమాని అనౌన్స్ చేశాడు మన మహేష్ మేనల్లుడు. ఈ మూవీ ఓపెనింగ్ నిన్న (ఫిబ్రవరి 5) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Ashok Galla : ప్రశాంత్ వర్మ కథతో.. మహేష్ మేనల్లుడి సినిమా..

Ashok Galla

Ashok Galla : టాలీవుడ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు కుటుంబం నుంచి పరిచమైన మరో హీరో ‘అశోక్ గల్లా’. గత ఏడాది ‘హీరో’ అనే సినిమాతో వెండితెరకు పరిచమయ్యాడు ఈ యువ హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ కామెడీ ఫిలింగా వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ నే అందుకుంది. దాదాపు ఏడాది తరువాత ఇప్పుడు తన రెండో సినిమాని అనౌన్స్ చేశాడు మన మహేష్ మేనల్లుడు. ఈ మూవీ ఓపెనింగ్ నిన్న (ఫిబ్రవరి 5) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Kalyan Ram : నా తమ్ముడు నా గుండెకాయ.. నాకు ఎవరూ లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు..

ఈ పూజ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అలాగే మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, బోయపాటి శ్రీను, అది శేషగిరిరావు, గల్లా జయదేవ్, బీవీఎస్ రవి మరియు ఇండస్ట్రీలోని ప్రముఖులు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. హీరో కత్తికేయతో ‘గుణ 369’ సినిమా తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. జాంబీ రెడ్డి, హనుమాన్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. ‘ఈ కథని తాను ఎంతో ఇష్టపడి రాసుకున్నట్లు, అందరికి గుర్తుండిపోయే సినిమా అవుతుంది’ అంటూ నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ తెలియజేశాడు.

ఇక విక్టరీ వెంకటేష్ ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నమ్రతా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది, మిర్యాల రవీంద్ర రెడ్డి సంయుక్తంగా ప్రశాంత్ వర్మకి స్క్రిప్ట్ ని అందించగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించాడు. హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘నన్ను అందరూ సాఫ్ట్ గా ఉన్నావు అంటారు. కానీ ఈ సినిమాతో నన్ను రఫ్ లుక్ లో కూడా మీరు అంగీకరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీని సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం అంటూ తెలియజేశారు. అలాగే చిత్రంలో పని చేసే మిగిలిన టెక్నిషన్స్ కూడా త్వరలో తెలియజేస్తాం అంటూ వెల్లడించారు.