Allu Arjun: “ధురంధర్” ఒక అద్భుతం.. రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

ధురంధర్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చూశారు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ కూడా ఇచ్చారు.

Allu Arjun: “ధురంధర్” ఒక అద్భుతం..  రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

Allu Arjun praises Ranveer singh Dhurandhar movie

Updated On : December 12, 2025 / 5:17 PM IST

Allu Arjun: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’. URI సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మరోసారి దేశభక్తి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత కొంతకాలంగా హిట్స్ కోసం చేస్తున్న రణవీర్ సింగ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించింది. దీంతో, బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా చూడటం కోసం క్యూ కడుతున్నారు. మంచి అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు రూ.7 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఏడు రోజులకు గాను రూ.27 కోట్లు కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Prabhas: రెబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్.. ఫ్యాన్స్ కి పండగే..

అయితే, ధురంధర్ సినిమాను తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) చూశారు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ కూడా ఇచ్చారు. ఇప్పుడే ‘ధురంధర్’ మూవీ చూడటం జరిగింది. బెస్ట్ యాక్టింగ్, అద్భుతమైన సాంకేతికత, ఎక్సలెంట్ సౌండ్‌ట్రాక్‌ తో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ తన న‌ట‌న‌తో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అక్షయ్ ఖన్నా రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో నటించేలేదు జీవించారు. సారా అర్జున్ న‌ట‌న కూడా బాగుంది. ఇంత మంచి సినిమాను నిర్మించిన జ్యోతి దేశ్‌పాండే, జియో స్టూడియోస్‌కు నా ప్రత్యేకమైన అభినందనలు. అలాగే మరీ ముఖ్యంగా కెప్టెన్‌, బెస్ట్ ఫిల్మ్ మేకర్ ఆదిత్య ధర్ గారికి. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. అందరూ తప్పకుండా చూడండి” అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.