Major: ఉద్విగ్నంగా ‘మేజర్‌’ ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు Mahesh Babu to launch the trailer of Adivi Sesh's 'Major'

Major: ఉద్విగ్నంగా ‘మేజర్‌’ ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు

అడివి శేష్ నటించిన సినిమా ‘మేజర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. పలుమార్లు వాయిదా పడిన మేజర్ సినిమా జూన్ 3న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

Major: ఉద్విగ్నంగా ‘మేజర్‌’ ట్రైలర్‌.. రిలీజ్ చేసిన మహేశ్ బాబు

Major: అడివి శేష్ నటించిన సినిమా ‘మేజర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. పలుమార్లు వాయిదా పడిన మేజర్ సినిమా జూన్ 3న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఈ ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించారు మేకర్స్‌. తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు రిలీజ్‌ చేయగా, హిందీలో సల్మాన్‌ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ విడుదల చేశారు.

Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్

మంచి ఏమోషన్స్‌తో ఇండియన్ ఆర్మీ.. మన సోల్జర్స్ గురించి ఉద్విగ్నంగా కనిపిస్తుంది. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌’ ఒకరు. 26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్‌’. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. తండ్రి పాత్ర‌లో న‌టించిన‌ ప్ర‌కాశ్ రాజ్ చెబుతున్న సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌కాశ్ రాజ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Major: మేజర్ నుంచి ప్రేమ గీతం.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజికల్!

ఇక అడవిశేష్‌.. ఉన్నికృష్ణన్‌ మాదిరిగా లుక్స్‌, మేకోవర్‌ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడ్డట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా.. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.

×