Tiruveer : హీరో అంటే నాకు ఇష్టం ఉండదు.. అలాంటి పాత్రలే వస్తుంటే బాధేసింది..

మాసూద సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో, తిరువీర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించడంతో సినిమాలో గోపి పాత్రలో నటించిన తిరువీర్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్.................

Tiruveer : హీరో అంటే నాకు ఇష్టం ఉండదు.. అలాంటి పాత్రలే వస్తుంటే బాధేసింది..

Masood fame Tiruveer interaction with media

Tiruveer :  రంగస్థల నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి మల్లేశం, పలాస, జార్జ్‌రెడ్డి, టక్ జగదీశ్ లాంటి సినిమాలో ఆర్టిస్ట్ గా నటించిన తిరువీర్ ఇటీవలే ముఖ్యపాత్రలో మాసూద సినిమాతో వచ్చాడు. హారర్ కాన్సెప్ట్ తో వచ్చి చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. థియేటర్స్ లో రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని సాధిస్తుంది. సినిమా చూసిన వాళ్లంతా మంచి హారర్ సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో ఒక సూపర్ హారర్ సినిమా చూశామనిపించింది అంటున్నారు.

మాసూద సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో, తిరువీర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించడంతో సినిమాలో గోపి పాత్రలో నటించిన తిరువీర్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరువీర్ ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

తిరువీర్ మాట్లాడుతూ.. ”హీరో అనే ట్యాగ్‌ నాకు ఇష్టం ఉండదు. సినిమాలో నేను ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అనుకోవాలి. నాకు మొదటినుంచి కూడా ఎక్కువగా ప్రతినాయక పాత్రలు, సైకో పాత్రలే వచ్చాయి. అలాంటి పాత్రలే వస్తుండటంతో నేనిలాంటి పాత్రలే చేస్తానా? ఇలాంటి వాటికే సూట్‌ అవుతానా? అని అనుకోని బాధపడేవాణ్ని. అలాంటి పాత్రాల్లోంచి బయటకి వచ్చి భిన్న రకాల పాత్రలు చేయాలనుకున్నాను. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు లాగా అన్నిరకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను.”

Aha Dance Ikon season 1 final : ఆహా డ్యాన్స్ ఐకాన్ ఫస్ట్ సీజన్ విన్నర్స్..

”అలాంటి సమయంలో మాసూద సినిమా కథ వచ్చింది. ఈ సినిమాలో నా పాత్రని అందరూ పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది. నిజ జీవితంలో కూడా నేను గోపి క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటాను. సినిమాల కౌంట్ కోసమో, డబ్బుల కోసమో నేను సినిమాలు చేయను. కథ నచ్చితేనే సినిమాకి ఓకే చెప్తాను. త్వరలో ‘పరేషాన్‌’ అనే సినిమాతో రాబోతుంది” అని తెలిపారు.