Raviteja Family : ఫ్యామిలీతో రవితేజ జపాన్‌లో సందడి.. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన మాస్ మహారాజ..

తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేశాడు మాస్ మహారాజ. తన ఫ్యామిలీతో కలిసి జపాన్(Japan) కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు రవితేజ.

Raviteja Family : ఫ్యామిలీతో రవితేజ జపాన్‌లో సందడి.. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసిన మాస్ మహారాజ..

Mass Maharaja Raviteja Shares Family Pics from Japan Photos goes Viral

Raviteja Family : మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ ఇటీవల ధమాకా(Dhamaka), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రావణాసుర(Ravanasura) యావరేజ్ గా నిలిచింది. త్వరలో టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. రవితేజ కెరీర్ లోనే మొదటి పీరియాడిక్ సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరాకు ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఆ తర్వాత సంక్రాంతికి ఈగల్ అనే మరో సినిమాని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో ఇంకో సినిమాని.. ఇలా వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు రవితేజ.

అయితే తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేశాడు మాస్ మహారాజ. తన ఫ్యామిలీతో కలిసి జపాన్(Japan) కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు రవితేజ. సాధారణంగా రవితేజ తన ఫ్యామిలీ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒక పిక్ షేర్ చేస్తాడు. తాజాగా జపాన్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని రవితేజ షేర్ చేయడం విశేషం. టోక్యో నుంచి తనవి కూడా కొన్ని సింగిల్ ఫోటోలు షేర్ చేశాడు రవితేజ.

OG Glimpse : అదిరిపోయిన OG గ్లింప్స్.. పవన్ అభిమానులకు పండగే..

Mass Maharaja Raviteja Shares Family Pics from Japan Photos goes Viral

 

రవితేజతో పాటు రవితేజ భార్య, అతని తనయుడు మహాధన్, కూతురు మోక్షదలతో పాటు రవితేజ తమ్ముడి కొడుకులు కూడా జపాన్ వెళ్లారు. జపాన్ టోక్యోలోని ప్రముఖ ప్లేస్ అయిన శిబూయ క్రాసింగ్ దగ్గర ఫ్యామిలీ అందరితో కలిసి దిగిన ఫోటోలను రవితేజ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలని షేర్ చేస్తూ.. ఫ్యామిలీ అంటూ లవ్ సింబల్ పెట్టాడు. మరో ఫోటోని షేర్ చేస్తూ.. టోక్యోలో ఇది మన RTC క్రాస్ రోడ్స్ లాంటిది అన్నమాట. కానీ రెండూ సేమ్ కావు అని సరదాగా పోస్ట్ చేశాడు. దీంతో చాలా రోజుల తర్వాత రవితేజ ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.