Meena : అలా ఉండుంటే నా భర్త బతికేవాడు.. అందుకే ఈ నిర్ణయం.. నటి మీనా ఎమోషనల్ పోస్ట్..

సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మీనా. ఈ పోస్ట్ లో.. ''ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ ఉండదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితాలకి...........

Meena : అలా ఉండుంటే నా భర్త బతికేవాడు.. అందుకే ఈ నిర్ణయం.. నటి మీనా ఎమోషనల్ పోస్ట్..

meena

Meena :  బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది మీనా. 2009లో మీనాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విద్యాసాగర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయి పాప పుట్టిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకి బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది.

అయితే ఈ ఏడాది జూన్ లో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా తర్వాత కోలుకున్నాక మీనా భర్త మాత్రం పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య వచ్చిందని చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మీనా విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కి హాజరవుతూ, ఫ్రెండ్స్ ని కలుస్తూ ఆ బాధ నుంచి బయటపడటానికి ట్రై చేస్తుంది మీనా. తాజాగా మీనా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. తాను మరణించాక తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు మీనా ప్రకటించింది.

Vijayashanthi : అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూలబడి కుదేలైంది.. లాల్ సింగ్ చడ్డాపై విజయశాంతి వ్యాఖ్యలు..

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మీనా. ఈ పోస్ట్ లో.. ”ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ ఉండదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితాలకి రెండో అవకాశం ఇస్తుంది అవయవ దానం. ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే నా సాగర్ బతికుండేవాడు, నా జీవితం మరోలా ఉండేది. ఒక డోనర్ ఎనిమిది మంది ప్రాణాలని కాపాడగలడు. ప్రతి ఒక్కరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా అవయవాలు దానం చేయడం ద్వారా ఒక మనిషిని బ్రతికించడమే కాదు, వారి కుటుంబాలలో కూడా ఆనందం ఇవ్వొచ్చు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా నా ఆర్గాన్స్ డొనేట్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని తెలిపింది మీనా. దీంతో మీనా చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు.