Vijayashanthi : అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూలబడి కుదేలైంది.. లాల్ సింగ్ చడ్డాపై విజయశాంతి వ్యాఖ్యలు..

ఈ ట్వీట్స్ లో.. ''మా జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదములు. భారత్ మాతాకీ జై. భారత్ మాతాకీ జై, దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత, హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమీర్ ఖాన్.........

Vijayashanthi : అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూలబడి కుదేలైంది.. లాల్ సింగ్ చడ్డాపై విజయశాంతి వ్యాఖ్యలు..
ad

Vijayashanthi :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగ చైతన్య మెయిన్ లీడ్స్ లో ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాని హాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. ఇటీవల ఆగస్టు 11న సినిమా రిలీజయింది. అయితే ఈ సినిమాకి బాయ్‌కాట్‌ సెగ తగిలింది. ‘లాల్ ‍సింగ్‌ చడ్డా’ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేశారు. గతంలో అమీర్ ఖాన్ దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలని గుర్తు చేస్తూ సినిమాని బాయ్ కాట్ చేశారు. సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా ఈ సినిమాని వ్యతిరేకించాలంటూ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ రాకపోగా ఫ్లాప్ టాక్ ని మూట కట్టుకుంది. దీనిపై చిత్ర యూనిట్ విచారణ వ్యక్తం చేస్తూ సినిమాని కొంతమంది టార్గెట్ చేశారు అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది అని కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాపై విజయశాంతి వ్యాఖ్యలు చేసింది. దీనిపై పలు ట్వీట్స్ చేసింది విజయశాంతి.

Action Movies : సో కాల్డ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు వద్దు.. యాక్షన్ లో కూడా కొత్తదనం కావాలి..

ఈ ట్వీట్స్ లో.. ”మా జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని, అడుగు వేసిన దేశ భక్తులకు ధన్యవాదములు. భారత్ మాతాకీ జై. భారత్ మాతాకీ జై, దేశంపై ద్వేషం, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత, హిందువులంటే చులకన భావంతో వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీసే ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు ఇప్పుడు కూలబడి కుదేలైంది. దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు ఆమీర్ నైజం తెలుసుకుని ఆయన సినిమాలంటే అసహ్యించుకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో గ్రహించి కనీసం పెట్టుబడైనా తిరిగి తెచ్చుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల మీద విదేశీ మార్కెట్ మీదే ఆధారపడ్డాడు. టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్ పప్పులు ఉడకలేదు. దీనంతటికీ కారణం ఒకటే మేకవన్నె పులిలా వ్యవహరించే ఆమీర్ అసలు తీరుపై హిందూ సంస్థలు, మాతృదేశ మరియు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలపై అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఫలితంగా ప్రజలు సత్యాన్ని తెలుసుకున్నారు. పాకిస్తాన్‌కి వంత పాడుతూ ఉగ్రవాదానికి నిధులిచ్చే టర్కీ దేశానికి అభిమాని అయిన ఆమీర్ ఖాన్ సినిమా టికెట్ డబ్బుల్ని పేదల కోసమో, మరో మంచి ప్రయోజనానికో ఉపయోగించాలన్న మాలాంటి అసంఖ్యాక జాతీయవాదుల పిలుపును అందిపుచ్చుకుని తగిన రీతిలో స్పందించారు. అంతేకాదు, తన సినిమాలు చూస్తే చూడండి, లేకుంటే లేదన్న లాల్ సింగ్ హీరోయిన్ కరీనా కపూర్ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా అర్ధం చేసుకున్నారు. ప్రజల్ని అమాయకులుగా భావించి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని గ్రహించాలి” అంటూ ఘాటుగానే పోస్ట్ చేసింది విజయశాంతి.