మెగా సంక్రాంతి సంబరాలు – స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ తనయుడు అకిరా..

మెగా సంక్రాంతి సంబరాలు.. తన ఫ్యామిలీలోని యంగర్ జెనరేషన్‌తో మెగాస్టార్ తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

10TV Telugu News

మెగా సంక్రాంతి సంబరాలు.. తన ఫ్యామిలీలోని యంగర్ జెనరేషన్‌తో మెగాస్టార్ తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా ఓ చోటచేరి భోగిని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, కల్యాణ్‌దేవ్‌,  నిహారిక, సుష్మితలతో సహా ఇతర కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక సంక్రాంతి సంబరాల విషయానికొస్తే కుటుంబ సభ్యులందరితో కలిసి సందడిగా జరుపుకున్నారు మెగాస్టార్. అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లతో పాటు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఈ సంక్రాంతి సంబరంలో పార్టిసిపేట్ చేయడం విశేషం.

తన ఫ్యామిలీలోని యంగర్ జెనరేషన్‌తో మెగాస్టార్ తీసుకున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కొడుకుని చూసిన ఫ్యాన్స్ ‘ఇది కదా అసలైన సంక్రాంతి’ అంటూ ఆ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు.  

Image

10TV Telugu News