Mohan Babu : హీరో విశాల్‌కి పొగరు ఎక్కువ.. మోహన్ బాబు కామెంట్స్!

తమిళ హీరో విశాల్ ‘లాఠీ’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. కాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం నిర్వహించింది చిత్ర యూనిట్. తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఈవెంట్ కి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో మోహన్ బాబు...

Mohan Babu : హీరో విశాల్‌కి పొగరు ఎక్కువ.. మోహన్ బాబు కామెంట్స్!

Mohan Babu comments on hero vishal

Mohan Babu : తమిళ హీరో విశాల్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ‘లాఠీ’ అనే టైటిల్ పెట్టుకొని ఒక పోలీస్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ‘సునైనా’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న క్రిస్టమస్ కానుకగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ సోమవారం నిర్వహించింది చిత్ర యూనిట్.

Vishal : చంద్రబాబుతో పోటీపై మరోసారి స్పందించిన హీరో విశాల్..

తిరుపతి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఈవెంట్ కి డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో మోహన్ బాబు, విశాల్ నాన్న గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో వారిద్దరూ కలిసి ‘ఎం ధర్మరాజు ఎం ఏ’ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలియజేశాడు. అలాగే విశాల్ సినిమాల్లో పందెం కోడి, పొగరు, చదరంగం వంటి సూపర్ హిట్టు సినిమాలు మాదిరి ఈ లాఠీ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుంది అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక విశాల్ గురించి మాట్లాడుతూ.. విశాల్ కి పొగరు ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ‘ప్రతి వ్యక్తిలోనూ ఆవేశం, కోపం, పొగరు ఉంటాయి. అయితే ఆ పొగరు ఎదుట వారికి హాని కలిగేలా ఉండకూడదు. విశాల్ పొగరు ఎదుట వారికీ మంచి చేసేలా ఉంటుంది. ఆ మనస్తత్వంతోనే కింద నుంచి ఇంతటి స్థాయికి వచ్చాడు’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.