సోనూసూద్ తో మోనాల్ స్టెప్పులు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

సోనూసూద్ తో మోనాల్ స్టెప్పులు, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Monal Gajjar Dance with Sonu Sood : మోనాల్ గుజ్జర్ అంటే చాలా మందికి తెలియదు. సుడిగాడు సినిమాలో నటించిన హీరోయిన్ గా మాత్రమే తెలుసు. తర్వాత..వెన్నెల వన్ అండ్ హాఫ్, బ్రదర్ ఆఫ్ బొమ్మాలితో పాటు హిందీ, మలయాళం తదితర భాషల్లో నటించింది. అయితే..అంతగా గుర్తింపు రాలేదు. కానీ..ప్రస్తుతం సీన్ మారిపోయింది. బిగ్ బాస్ 04 సీజన్ లో ఏకంగా 95 రోజులు ఇంట్లో ఉంటూ..అందర్నీ అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఫినాలేకు వారం దూరంలో ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా ఈమె పాపులారిటీ పెరిగిపోయింది. బిగ్ బాస్ 4లో గ్లామరస్ కంటెస్టెంట్ గా మోనాల్ అలరించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం..ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాల ఆఫర్లతో బిజీ బిజీ గా మారిపోతోంది ఈ అమ్ముడు.

Sonu Sood, Bellamkonda Srinivas

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతోంది. నభా నటేష్, అనూ ఇమ్మాన్యుల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారు. ప్రత్యేకమైన సెట్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనూ సూద్, నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్, మోనాల్ గుజ్జర్ లపై సాంగ్ చిత్రీకరించారు. సాయి శ్రీనివాస్, సోనూ సూద్ తో కలిసి మోనాల్ స్టెప్పులేసింది. మరి మోనాల్ ఈ పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటుందోనన్న చర్చ మొదలైంది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ. 15 లక్షలు పారితోషకం తీసుకుందని టాక్ వినిపిస్తోందంట.