Producer Appi Reddy : సినిమాల రీ రిలీజ్‌లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తా.. రీ రిలీజ్‌ల వల్ల చిన్న సినిమాలకు ఎఫెక్ట్..

ఆగస్టు 18న మిస్టర్ ప్రగ్నెంట్ తో పాటు ప్రేమ్ కుమార్, జిలేబి లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు రఘువరన్ Btech, యోగి సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వడంతో అభిమానులు వాటికి వెళ్లారు.

Producer Appi Reddy : సినిమాల రీ రిలీజ్‌లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తా.. రీ రిలీజ్‌ల వల్ల చిన్న సినిమాలకు ఎఫెక్ట్..

Mr Pregnant Movie Producer Appi Reddy Sensational comments on Old Movies Re Releases

Producer Appi Reddy :  ఇటీవల పాత సినిమాలను రీ రిలీజ్(Re Release) లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలని రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్‌లకు భారీగా వస్తుండటంతో డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. దీంతో కొంతమంది ఫ్లాప్ సినిమాలు, అభిమానులకు కూడా నచ్చని సినిమాలని ప్రమోషన్స్ చేసి మరీ రీ రిలీజ్‌లు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోడానికి రీ రిలీజ్ లు చేస్తున్నారు. మొదట్లో హీరోల పుట్టిన రోజులకో, ఏదో ఒక స్పెషల్ డేస్ లోనో సినిమాలను రీ రిలీజ్ చేశారు, కానీ ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పాత సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ రీ రిలీజ్‌ల వల్ల చిన్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ పడుతుంది. స్టార్ హీరోల సినిమాలు లేని టైం చూసుకొని చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి. అది కూడా వీకెండ్స్ లో పెద్ద హీరోల సినిమాలు లేని డేట్స్ దొరకడం కష్టం. కానీ అలాంటి డేట్స్ వచ్చినా ఇప్పుడు అవి కూడా రీ రిలీజ్‌లతో నింపేస్తున్నారు. దీంతో చిన్న సినిమాలకు భారీగా దెబ్బ పడుతుంది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్(Sohel) హీరోగా మిస్టర్ ప్రగ్నెంట్(Mr Pregnant) అనే కొత్త కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి విజయం సాధించినప్పటికీ కలెక్షన్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయి. ఇందుకు కారణం ఈ సినిమా రిలీజ్ రోజే రెండు సినిమాలని రీ రిలీజ్ చేశారు.

ఆగస్టు 18న మిస్టర్ ప్రగ్నెంట్ తో పాటు ప్రేమ్ కుమార్, జిలేబి లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు రఘువరన్ Btech, యోగి సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వడంతో అభిమానులు వాటికి వెళ్లారు. యోగి ఫ్లాప్ సినిమా అయినా, అసలు ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించి స్పెషల్ డేస్ లేకపోయినా కేవలం డబ్బుల కోసమే రీ రిలీజ్ చేశారు. దీనిపై మిస్టర్ ప్రగ్నెంట్ నిర్మాత అప్పిరెడ్డి స్పందించారు.

Suhas : హీరోగా ఏకంగా ఆరు సినిమాలు.. దూసుకుపోతున్న సుహాస్.. స్టార్ హీరోలకు కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ లేవుగా..

మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు వీకెండ్ దొరకడమే కష్టం. అలాంటిది ఆ సమయంలో మళ్ళీ రీ రిలీజ్ లు అని పాత సినిమాలు తీసుకొస్తున్నారు. దీనివల్ల చిన్న సినిమాలకు దెబ్బ పడుతుంది. నేను రీ రిలీజ్ సినిమాలకు వ్యతిరేకం కాదు. కానీ రీ రిలీజ్‌లు వీకెండ్స్ కాకుండా సోమ, మంగళవారాల్లో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. వీకెండ్స్ రిలీజ్ చేస్తే అప్పుడు వచ్చే చిన్న సినిమాలకు ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి దీనిపై ఆలోచించండి. చిన్న చిత్రాలు రిలీజ్ అయ్యే రోజుల్లో పాత సినిమాలు రీ రిలీజ్ చేయకండి. త్వరలో ఈ విషయంపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తాను అని అన్నారు. మరి నిర్మాత అప్పిరెడ్డి వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.