Naga Shaurya : ‘జూ.ఎన్టీఆర్’కు ఒక న్యాయం.. నాకొక న్యాయమా.. విలేకరిపై నాగశౌర్య సీరియస్!

నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటిస్తున్న ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఒక విలేకరి మాట్లాడుతూ.. బ్రాహ్మణులా మాట్లాడడం నేర్చుకున్నా, బ్రాహ్మణులా నడవడం నేర్చుకున్నా అంటున్నారు. అంటే బ్రాహ్మణులు మనుషుల్లో ఒకరు కాదా...

Naga Shaurya : ‘జూ.ఎన్టీఆర్’కు ఒక న్యాయం.. నాకొక న్యాయమా.. విలేకరిపై నాగశౌర్య సీరియస్!

Naga Shaurya Serious on Media Repoter

Naga Shaurya : నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటిస్తున్న ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో నిర్మిస్తున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది.

Naga Shaurya : నా దగ్గరేం డబ్బులు లేవు.. హీరో అయ్యాకే కారు, ఇల్లు కొనుక్కున్నాను.. మా అమ్మ నా కోసం ఇప్పటికి వడ్డీలు కడుతుంది..

ఈ క్రమంలో ఒక విలేకరి మాట్లాడుతూ.. బ్రాహ్మణులా మాట్లాడడం నేర్చుకున్నా, బ్రాహ్మణులా నడవడం నేర్చుకున్నా అంటున్నారు. అంటే బ్రాహ్మణులు మనుషుల్లో ఒకరు కాదా అని ప్రశ్నించాడు. దీనికి నాగశౌర్య బదులిస్తూ.. “ఇదే మాట మీరు జూ.ఎన్టీఆర్ అదుర్స్ సినిమా తీసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు” అని అడిగాడు.

“ఇటీవల వచ్చిన పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాస నేర్చుకున్నాడు. అది కూడా తెలుగు భాషే, కానీ నెల్లూరు వాసిగా నటిస్తే సరిపోదు భాషతో కూడా మెప్పించాలనే ప్రయత్నం. నేను కూడా అంతే.. బ్రాహ్మణుడు కుర్రాడి పాత్ర పోషిస్తే సరిపోదు, వాళ్ళ భాష-నడవడికలు కూడా అనుసరించాలి. అప్పుడే పాత్రకు న్యాయం చేసినట్లు అవుతుంది”.. అంటూ బదులిచ్చాడు.