Nagababu : గరికపాటికి కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్

గరికపాటి నరసింహారావు చిరంజీవిని ఉద్దేశించి.. “చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను మాట్లాడతాను, లేదంటే నేను ప్రసంగం ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను” అంటూ ఘాటుగానే మాట్లాడారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై.............

Nagababu : గరికపాటికి కౌంటర్ ఇచ్చిన మెగా బ్రదర్

Nagababu conter to Garikapati Narasimharao

Nagababu :  ప్రతి సంవత్సరం ప్రముఖ రాజకీయ నేత బండారు దత్తాత్రేయ దసరా సమయంలో ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజాకీయ ప్రముఖులు హాజరవుతారు. ఈ సారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి పలువురు ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు.

కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఇంకా కొంతమంది మాట్లాడాల్సి ఉండగా చిరంజీవితో ఫోటోలు దిగడానికి అక్కడున్నవారు ఎగబడ్డారు. చిరంజీవి కూడా కాదనలేక అడిగిన వారందరికీ ఫోటోలు ఇస్తున్నారు. దీంతో గరికపాటి మాట్లాడాల్సి ఉండగా అందరూ చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తుండటంతో గరికపాటి వేదికపైనే మెగాస్టార్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

BiggBoss 6 Day 32 : కొత్త కెప్టెన్ కోసం టాస్కులు.. కంటెస్టెంట్ల కోరికలు.. ఎమోషనల్ ఎపిసోడ్..

వేదికపైనే గరికపాటి నరసింహారావు చిరంజీవిని ఉద్దేశించి.. “చిరంజీవి గారు మీరు ఫోటోలు దిగడం ఆపితే నేను మాట్లాడతాను, లేదంటే నేను ప్రసంగం ఆపి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను” అంటూ ఘాటుగానే మాట్లాడారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఇండైరెక్ట్ గా ట్విట్టర్ లో స్పందించారు. ఈ ఘటన జరిగిన తర్వాత నాగబాబు తన ట్విట్టర్లో.. ”ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అని ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ గరికపాటిని ఉద్దేశించి చేసిందే అని వైరల్ గా మారింది. మరి దీనిపై గరికపాటి మళ్ళీ స్పందిస్తారేమో చూడాలి.