The Ghost: ‘ది ఘోస్ట్’తో రిస్క్ చేస్తోన్న నాగ్.. వర్కవుట్ అయ్యేనా?

అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించాడు.ది ఘోస్ట్ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో హిందీ బెల్ట్‌లో ది ఘోస్ట్ చిత్రాన్ని నాగ్ స్వయంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

The Ghost: ‘ది ఘోస్ట్’తో రిస్క్ చేస్తోన్న నాగ్.. వర్కవుట్ అయ్యేనా?

Nagarjuna Risking With The Ghost In Bollywood

The Ghost: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో నాగ్ ఒక రా ఏజెంట్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ మూవీపై నెలకొన్న అంచనాలను పెంచేశాయి.

The Ghost: ది ఘోస్ట్ రిలీజ్ ట్రైలర్.. యాక్షన్‌తో దుమ్ములేపిన కింగ్!

కాగా, ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ముఖ్యంగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో నాగ్ ఇటీవల బాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ది ఘోస్ట్ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో హిందీ బెల్ట్‌లో ది ఘోస్ట్ చిత్రాన్ని నాగ్ స్వయంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

The Ghost Movie: ‘ది ఘోస్ట్’ మూవీ రన్‌టైమ్ లాక్.. ఎంతంటే..?

అయితే బిటౌన్‌లో ప్రస్తుతం సినిమాలు కష్టంగా హిట్ అవుతున్న నేపథ్యంలో డబ్బింగ్ మూవీగా వెళ్తున్న ‘ది ఘోస్ట్’ అక్కడి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుంది.. అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తూ నాగ్ రిస్క్ చేస్తున్నారా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి సినిమాలో కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే, ఈ సినిమాకు అడ్డు ఏదీ ఉండదు. కానీ, ఏదైనా తేడా కొడితే మాత్రం నాగ్ చేతులు కాల్చుకోవడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.