Naga Chaitanya : NC22 టైటిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటించిన నాగచైతన్య.. ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్..

వరుసపెట్టి టాలీవుడ్-కోలీవుడ్ కంబినేషన్స్ సెట్ చేస్తూ మూవీ మేకర్స్ ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాడు. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం 'NC22' వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ..

Naga Chaitanya : NC22 టైటిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటించిన నాగచైతన్య.. ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్..

NC22 title release date fix

Naga Chaitanya : వరుసపెట్టి టాలీవుడ్-కోలీవుడ్ కంబినేషన్స్ సెట్ చేస్తూ మూవీ మేకర్స్ ఆడియన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశాడు. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ‘NC22’ వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది.

Naga Chaitanya: నాగచైతన్య సినిమాలో వంటలక్క..

ఇది చైతన్య కెరీర్ లో మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ.. మూవీ ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నవంబర్ 23న ఉదయం గం.10:18 నిమిషాలకు సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. కాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆడియన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. మరి చైతుకి ఎప్పటినుంచో అందని ద్రాక్షలా ఉన్న మాస్ కమర్షియల్ హిట్ ఈ చిత్రం అందిస్తుందో లేదో చూడాలి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.