నితిన్ ‘అంధాధూన్’ రీమేక్ ప్రారంభం..

నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘అంథాధూన్’ రీమేక్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

నితిన్ ‘అంధాధూన్’ రీమేక్ ప్రారంభం..

నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘అంథాధూన్’ రీమేక్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

యంగ్ హీరో నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. మూడు ఫ్లాపుల తర్వాత తాజాగా ‘భీష్మ’తో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటితో ‘చెక్’ అనే సినిమాలు చేస్తున్న నితిన్ ఇప్పుడు మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

హిందీలో సూపర్ హిట్ అయిన ‘అంధాధూన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ నివ్వగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.

Nithin, Merlapaka Gandhi Combined for Andhadhun Remake