NTR Tweet on Bimbisara : అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు ఆ క్యారెక్టర్.. బింబిసారపై ఎన్టీఆర్ ట్వీట్..

ఇవాళ ఉదయం బింబిసార సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమాని అభినందిస్తూ..''బింబిసార సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. మొదటి సారి సినిమా చూసినప్పుడు......

NTR Tweet on Bimbisara : అన్నా నువ్వు తప్ప ఎవరూ చేయలేరు ఆ క్యారెక్టర్.. బింబిసారపై ఎన్టీఆర్ ట్వీట్..

ntr tweet on bimbisara

Updated On : August 5, 2022 / 2:54 PM IST

NTR Tweet on Bimbisara :  కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా నేడు ఆగస్టు 5న రిలీజ్ అయింది. ముందు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై కళ్యాణ్ రామ్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. కళ్యాణ్ రామ్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బింబిసార సినిమా చూసి ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Samyuktha Menon : టాలీవుడ్ హీరోలపై సంయుక్త మీనన్ కామెంట్స్.. ఏ హీరో గురించి ఏం చెప్పింది..?

ఇవాళ ఉదయం బింబిసార సినిమా చూసిన ఎన్టీఆర్ సినిమాని అభినందిస్తూ..”బింబిసార సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సినిమాను ఆస్వాదిస్తున్నారు. మొదటి సారి సినిమా చూసినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ రామ్ అన్న బింబిసార రాజుగా నువ్వు తప్ప ఈ క్యారెక్టర్‌ను ఎవరూ చేయలేరు. డైరెక్టర్ విశిష్ఠ్ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. లెజండరీ ఎంఎం కీరవాణి సంగీతం బింబిసార సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ఈ మూవీని సక్సెస్ చేసేందుకు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు” అని ట్వీట్స్ చేశారు. దీంతో ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.