మజిలీ నుంచి ‘వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్’

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’.

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 07:26 AM IST
మజిలీ నుంచి ‘వ‌న్ బాయ్ వ‌న్ గార్ల్’

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’.

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’. ‘న్నినుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఈ సినిమాకి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. అంతేకాదు ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటించింది.
Read Also : కారణం అదే : ప్రియాంక, నిక్ జోనస్ విడాకులు?

తాజాగా చిత్రం నుండి ‘వ‌న్ బాయ్ వ‌న్ గర్ల్’ సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాంగ్‌కి సంబంధించిన విశేషాల‌ని వెల్ల‌డించారు. గోపిసుంద‌ర్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని రేవంత్ ఆల‌పించ‌గా ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించారు. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఈ సాంగ్ రిలీజ్ తరువాత.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ సాంగ్ రిలీజ్ తరువాత.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది.