People Media Factory : 100 సినిమాలు టార్గెట్.. 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. సైలెంట్ గా దూసుకొస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

సినిమాలే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల ఓటీటీ, టీవీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆహా ఓటీటీ కోసం పలు సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఓ టీవీ ఛానల్ లో అలా మొదలైంది అనే ఓ షోని కూడా నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో ఫుల్ ఫామ్ లో ఉంది.

People Media Factory : 100 సినిమాలు టార్గెట్.. 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.. సైలెంట్ గా దూసుకొస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

People Media Factory target producing 100 movies in short time

People Media Factory :  ఇటీవల కార్తికేయ 2(Karthikeya 2), ధమాకా(Dhamaka) లాంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలని అందించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory). ఎప్పట్నుంచో పలు సినిమాలు చేస్తూ వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల కాలంలో కరోనా తర్వాత స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేస్తూ, వరుస హిట్స్ అందుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కూడా సినిమా చేస్తుంది. సినిమాలే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల ఓటీటీ(OTT), టీవీలోకి(TV) కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆహా(Aha) ఓటీటీ కోసం పలు సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఓ టీవీ ఛానల్ లో అలా మొదలైంది(Ala Modalaindi) అనే ఓ షోని కూడా నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఇలా సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో ఫుల్ ఫామ్ లో ఉంది. త్వరలో మే 5న గోపీచంద్ రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తాజాగా రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామబాణం సినిమా గురించి, తమ నిర్మాణ సంస్థ గురించి పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

ఇంటర్వ్యూలో టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఎలాంటి సినిమాలు చేయాలని మేమేమి ప్రణాళికలు వేసుకోలేదు. వచ్చిన కథల్లో మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాం. చిన్న, పెద్ద అన్ని సినిమాలు చేస్తాం. అతి త్వరగా 100 సినిమాలు చేసిన నిర్మాణ సంస్థగా నిలవాలన్నదే మా టార్గెట్. ఇప్పటికే 15 సినిమాలు పైగా తీశాము. మరో 15 సినిమాలు సెట్స్ మీద, ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాయి. రాబోయే నాలుగేళ్లలో కనీసం 30కి పైగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. ఏడాదికి కనీసం అయిదు సినిమాలు నిర్మించినా ఒక్క సినిమా అయినా పెద్ద హిట్ అవుతుందని మా నమ్మకం అని అన్నారు.

TG Vishwaprasad : సినిమా షూటింగ్‌లో గోపీచంద్‌కు గాయం.. మూడు నెలలు ఆగిపోయిన షూటింగ్.. అందుకే ఆలస్యం..

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ సినిమా, ప్రభాస్ – మారుతి సినిమా, గూడాచారి 2 సినిమా, కార్తికేయ 3 సినిమా, సిద్దార్థ్ టక్కర్ సినిమా.. ఇలా పలు సినిమాలు ఉన్నాయి. ఇలా వరుసగా స్టార్ హీరోలతో, మరో పక్క యువ హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తూ హిట్స్ కొడుతూ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.