P R Ramesh : VerSe Innovation కీలక నిర్ణయం.. స్వతంత్ర డైరెక్టర్ గా పీఆర్ రమేష్ నియామకం
P R Ramesh : VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పీఆర్ రమేష్ ని నియమించింది.
pr ramesh appointed as independent director of verse innovation
P R Ramesh : భారతదేశంలోని ప్రముఖ ఏఐ (AI) ఆధారిత స్థానిక భాషా ప్లాట్‌ఫామ్ VerSe Innovation కీలక నియామకం చేపట్టింది. తన బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా పీఆర్ రమేష్ ని నియమించింది. ఆయన కంపెనీ ఆడిట్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. కంపెనీ తన తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశిస్తున్న సమయంలో, ఈ నియామకం గవర్నెన్స్ నిర్మాణాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. పీఆర్ రమేష్ 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ (CA).
గతంలో ఆయన డెలాయిట్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేశారు. దీంతోపాటు ఎయిర్ ఇండియా, నెస్లే, ఎల్ అండ్ టీ వంటి ప్రఖ్యాత కంపెనీల బోర్డులలో కొనసాగుతున్నారు. ఆయన 2022-23 సంవత్సరానికి గాను ‘ఉత్తమ స్వతంత్ర డైరెక్టర్’ అవార్డును కూడా అందుకున్నారు. దీనితో పాటు ఆయన సెబీ (SEBI), ఐఆర్డీఏ (IRDA) వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో కూడా సభ్యుడిగా ఉన్నారు.
VerSe సహ వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ.. “ఒక కంపెనీ కాల పరీక్షలను తట్టుకుని నిలబడాలంటే.. దానికి బలమైన ఆర్థిక క్రమశిక్షణతో పాటు పారదర్శకత కూడా అవసరం. రమేష్ అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని” ధీమా వ్యక్తం చేశారు. పీఆర్ రమేష్ మాట్లాడుతూ.. “ఒక సంస్థ పెరిగే కొద్దీ, దాని బాధ్యత కూడా పెరుగుతుంది. సంస్థను మరింత క్రమశిక్షణతో, జవాబుదారీతనంతో నడిచేలా చేయడానికి నేను బోర్డుతో కలిసి పనిచేస్తాను” అని చెప్పుకొచ్చారు.
VerSe Innovation తన AI సాంకేతికత ద్వారా భారతదేశంలో నేడు వందల మిలియన్ల మందికి.. వారి స్థానిక భాషల్లో కంటెంట్ అందిస్తోంది. దీని ప్లాట్‌ఫారమ్‌లలో డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), మ్యాగ్జ్టర్ (Magzter), నెక్స్ వర్స్ వంటివి ఉన్నాయి.

