Best Electric Cars : పెట్రోల్, డీజిల్ కన్నా EV కార్లు బెటర్.. రూ. 15 లక్షల లోపు స్మార్ట్ ఫీచర్లతో 6 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఏ కారు కొంటారంటే?
Best Electric Cars : పెట్రోల్, డీజిల్ ఇబ్బందులెందుకు.. అద్భుతమైన ఫీచర్లతో ఈవీ కార్లు ఉండగా అనిపిస్తోందా? అయితే, ఈ ఎలక్ట్రిక్ కార్లను రూ. 15 లక్షల కన్నా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు..
Best Electric Cars ( Image Credit : AI )
- రూ. 15 లక్షల లోపు ధరలో అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లు
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఈవీ వాహనాలపై ఆసక్తి
- టాటా మోటార్స్ నుంచి ఎంజీ, సిట్రోయెన్ వరకు అద్భుతమైన ఆఫర్లు
Best Electric Cars : పెట్రోల్, డీజిల్ బండ్లు ఎందుకు భయ్యా.. బంకుల దగ్గర పడిగాపులు తప్ప.. కొంటే మంచి ఎలక్ట్రానిక్ బండి కొంటే బెటర్ అనిపిస్తోందా? మీరు కూడా కొత్త ఈవీ కారు కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. నేటి యూత్ ఎలక్ట్రిక్ కార్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోంది.
మీరు కూడా ఈవీ అభిమాని అయితే మార్కెట్లో రూ. 15 లక్షల లోపు ధరలో అనేక అద్భుతమైన ఈవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు చాలా సరసమైనవి. అలాగే అదిరిపోయే ఫ్యూయిల్ సామర్థ్యాన్ని అందిస్తాయి. పైగా ఎకో ఫ్రెండ్లీ కూడా.. అసలు పొల్యుషన్ బాధే ఉండదు.
ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ అధిక ధరల కారణంగా వినియోగదారులంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. మీ బడ్జెట్ రూ. 15 లక్షల కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
టాటా మోటార్స్ నుంచి ఎంజీ, సిట్రోయెన్ వరకు అనేక కంపెనీలు బడ్జెట్‌కు అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి.
టాప్ రేంజ్ అందించడమే కాదండోయ్.. ఫీచర్ల పరంగా కూడా ఖతర్నాక్ అనిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ 6 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం..
రూ. 15 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు :
1. టాటా పంచ్.ఈవీ :
ఈ టాటా మైక్రో-ఎస్యూవీ ప్రస్తుతం పాపులర్ ఆప్షన్లలో ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.69 లక్షలు. 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో (25kWh, 35kWh) లభిస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
2. ఎంజీ విండ్సర్ ఈవీ :
ఈ సెగ్మెంట్లో ఎంజీ కొత్త విండ్సర్ ఈవీ కూడా రూ. 14 లక్షల ప్రారంభ ధరతో పోటీ పడుతోంది. BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) మోడల్ పాపులర్ పొందింది. ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. లగ్జరీ లాంజ్ లాంటి క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
అత్యుత్తమ EV కార్లు ఇవే :
| కారు మోడల్ | ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) | రేంజ్ (ARAI ) |
| టాటా టియాగో.ఈవీ | రూ. 7.99 లక్షలు | 250-315 కి.మీ. |
| MG కామెట్ EV | రూ. 6.99 లక్షలు | 230 కి.మీ. |
| టాటా నెక్సాన్.ఈవీ | రూ. 12.49 లక్షలు | 325-465 కి.మీ. |
| సిట్రోయెన్ eC3 | రూ. 12.90 లక్షలు | 320 కి.మీ. |
మార్చిలో కారు కొంటే బెనిఫిట్స్ ఇవే :
ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు :
మార్చి ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. సిట్రోయెన్ వంటి కంపెనీలు తమ eC3పై రూ. 40,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
గ్రీన్ కార్ లోన్ : ఎస్బీఐ, ఇతర బ్యాంకులు ఎలక్ట్రిక్ కార్ల కోసం గ్రీన్ లోన్ పథకాలను అందిస్తున్నాయి. ఇందులో వడ్డీ రేట్లు సాధారణ కార్ లోన్ల కన్నా 0.25శాతం నుంచి 0.50శాతం వరకు తక్కువగా ఉంటాయి.
లో మెయింట్‌నెన్స్ ఖర్చు : పెట్రోల్ కారు సగటు నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు రూ. 7 నుంచి రూ. 9 కాగా, ఈవీలో ఈ ఖర్చు కిలోమీటరుకు కేవలం రూ. 1 నుంచి రూ. 1.50కి తగ్గుతుంది.
