PBKS vs GT : గుజరాత్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. హెడ్-టు-హెడ్.. పిచ్ రిపోర్టు..
మంగళవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు (PBKS vs GT) తలపడనున్నాయి.
IPL 2026 PBKS vs GT head to head pitch report
PBKS vs GT : ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పైనే ఉంది. టీమ్ఇండియాలో స్టార్ ప్లేయర్లు అయిన వీరిద్దరు ఈ సారి ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తారో అని ఎదురుచూస్తున్నారు.
Hardik Pandya : గర్ల్ ఫ్రెండ్‌కు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఫోటోలు వైరల్
హెడ్-టు-హెడ్..
ఐపీఎల్లో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు 6 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. చెరో మూడు మ్యాచ్‌ల చొప్పున విజయం సాధించాయి.
పిచ్..
సాధారణంగా మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు జట్లలోనూ పెద్ద హిట్టర్లు ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్లు ఆశించవచ్చు.
వాతావరణం..
ముల్లన్‌పూర్‌లో మ్యాచ్ రోజు మబ్బులతో పాటు ఎండ ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక రాత్రి పూట వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉష్ణోగ్రత 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుందని అంచనా. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు లేవు.
తుది జట్ల అంచనా..
పంజాబ్ కింగ్స్..
ప్రియాంష్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
MI vs KKR : మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ప్రపోజ్.. రింగ్ పోయింది.. కట్ చేస్తే..
గుజరాత్ టైటాన్స్..
శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
