Pooja Hegde: పూజా ఆశలను ఆవిరి చేసిన సర్కస్..!

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్‌పై పెట్టింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘సర్కస్’ మూవీలో పూజా హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అంతేగాక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Pooja Hegde: పూజా ఆశలను ఆవిరి చేసిన సర్కస్..!

Pooja Hegde Disappointed With Cirkus Result

Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్‌పై పెట్టింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘సర్కస్’ మూవీలో పూజా హీరోయిన్‌గా నటించడంతో ఈ సినిమాపై ఆమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అంతేగాక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Pooja Hegde: మళ్లీ పాత బిరుదునే తగిలించుకుంటున్న బుట్టబొమ్మ..!

కానీ, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశకు లోనయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న పూజా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటాలని పూజా భావించింది. కానీ, ఈ సినిమా రిజల్ట్‌తో ఆమె బాలీవుడ్ ఆశలకు గండి పడింది. ఇక ఆమె హోప్స్ అన్ని కూడా సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న సినిమాపైనే పెట్టేసుకుంది.

‘కబీ ఈద్ కబీ దివాలీ’ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్‌లో సక్సెస్ కొట్టాలని పూజా చూస్తుంది. మరి పూజా బాలీవుడ్ ఆశలపై ‘సర్కస్’ నీళ్లు చల్లడంతో, సల్మాన్ ఖాన్ ఆమె కోరుకుంటున్న హిట్ అందిస్తాడా లేడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక తెలుగులో పూజా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో నటిస్తోంది.