Sita Ramam: ‘సీతా రామం’కు నో చెప్పిన స్టార్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఒక స్టార్ బ్యూటీ మాత్రం ఈ సినిమాను చూసి బాధపడుతోంది. ఇంతకీ ‘సీతా రామం’ సినిమాను చూసి బాధపడుతున్న స్టార్ బ్యూటీ ఎవరు?

Sita Ramam: ‘సీతా రామం’కు నో చెప్పిన స్టార్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Sita Ramam: దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకు కేవలం తెలుగునాటే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమా హిట్ సాధించడంతో ఇండస్ట్రీలోని చాలా మంది తమ సంతోషాన్ని తెలిజయేస్తున్నారు.

Sita Ramam: అమెరికాలో అదరగొడుతున్న సీతా రామం!

కానీ.. ఒక స్టార్ బ్యూటీ మాత్రం ఈ సినిమాను చూసి బాధపడుతోంది. ఇంతకీ ‘సీతా రామం’ సినిమాను చూసి బాధపడుతున్న స్టార్ బ్యూటీ ఎవరు.. ఆమె ఎందుకు ఈ సినిమాను చూసి బాధపడుతుందని అనుకుంటున్నారా.. సీతా రామం సినిమాలో హీరోయిన్‌గా తొలి ఛాన్స్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే వద్దకు వెళ్లిందట. అయితే ఈ సినిమాను ఆమె ఎందుకో ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది.

Sita Ramam First Day Collections: సీతా రామం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

ఇక సీత పాత్రలో మృణాల పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాతో అమ్మడికి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. ఇప్పుడు ఇలా తాను వదులుకున్న సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో పూజా హెగ్డే బాధపడుతోందట. తాను ఈ సినిమాను అనసవరంగా వదులుకున్నానే అంటూ అమ్మడు ఫీల్ అవుతోందట. ఏదేమైనా అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి.. ఇలా చేజార్చుకుని బాధపడితే ఏం లాభం లేదని పూజా అభిమానులు అంటున్నారు.