Sita Ramam: అమెరికాలో అదరగొడుతున్న సీతా రామం!

మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం...

Sita Ramam: అమెరికాలో అదరగొడుతున్న సీతా రామం!

Sita Ramam: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన విధానం, ప్రేక్షకులను అలరిండంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినామలో దుల్కర్ సరసన అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.

Sita Ramam First Day Collections: సీతా రామం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

ఇక వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్, ఎమోషన్స్‌కు క్లాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా క్లాస్ సబ్జెక్టులంటే ఇష్టపడే ఓవర్సీస్ ఆడియెన్స్ ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. దుల్కర్, మృణాల్‌ల లవ్ ట్రాక్‌కు వారు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన పోషించిన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందర అందరిలో ఓ సందేహం నెలకొంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరగడంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sita Ramam: సీతా రామం ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

ముఖ్యంగా ఈ సినిమా అమెరికాలో 7 లక్షల డాలర్స్ టార్గెట్‌తో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మార్క్ ను అందుకుంటుందో లేదో అనే సందేహం నెలకొంది. కానీ ఈ సినిమా వసూళ్లను చూసి సినీ ఎక్స్ పర్ట్స్ సైతం షాక్ కు గురవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోలు, తొలి రెండు రోజులు కలుపుకుని అమెరికాలో ఏకంగా 4 లక్షల డాలర్స్‌ను కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నాయి చిత్ర వర్గాలు. మరి ఈ సినిమా అమెరికాలో తన టోటల్ రన్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా ‘సీతా రామం’ సినిమా అమెరికాలో అదరగొడుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.