Sita Ramam First Day Collections: సీతా రామం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా, నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టగా, ఈ వీకెండ్ ముగిసే సరికి కలెక్షన్లు ఖచ్చితంగా పెరుగుతాయని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి.

Sita Ramam First Day Collections: సీతా రామం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

Sita Ramam First Day Collections: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా, నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించడంతో, తొలుత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. కానీ, ఈ చిత్ర టీజర్స్, ట్రైలర్ల క్లాసిక్‌గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Sita Ramam: సీతా రామం అక్కడ బ్యాన్..?

ఇక నిన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ ఠాకూర్‌ల పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యుద్ధం, ప్రేమ అనే రెండు అంశాలను దర్శకుడు చాలా చక్కగా చూపించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమాకు తొలిరోజు మంచి కలెక్షన్లు రావడంతో, ఈ వీకెండ్ ముగిసే సరికి ఈ వసూళ్లు మరింత పెరగడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Sita Ramam: సీతా రామం ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

కాగా, తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.5.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఏరియాల వారీగా ఈ చిత్ర తొలిరోజు వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 0.54 కోట్లు
సీడెడ్ – 0.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.21 కోట్లు
ఈస్ట్ – 0.15 కోట్లు
వెస్ట్ – 0.08 కోట్లు
గుంటూరు – 0.15 కోట్లు
కృష్ణా – 0.13 కోట్లు
నెల్లూరు – 0.08 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 1.50 కోట్లు (రూ.2.25 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.15 కోట్లు
ఇతర భాషలు – 0.35 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.3.05 కోట్లు(రూ.5.60 కోట్ల గ్రాస్)