Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!

అయితే ‘Project - K’ లోనే మూవీ నేమ్ ఉందని, ‘కె’ అక్షరంతోనే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..

Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!

Prabhas Nag Ashwin

Prabhas: ‘బాహుబలి’ తో మరోసారి తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది.. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌ని పాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తూ.. హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోని మైండ్ బ్లోయింగ్ స్టోరీతో, హై ఎండ్ టెక్నికల్ వాల్యూస్‌తో బ్రహ్మాండమైన సినిమా చేస్తున్నాడు యంగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రామిసింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్, ఎపిక్ ఫిల్మ్ షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘Project-K’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టినట్లు ఓపెనింగ్ రోజు క్లాప్ బోర్డ్ మీద చూపించారు.

Project – K : ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – కె’ ప్రారంభం..

అయితే ‘Project-K’ లోనే మూవీ నేమ్ ఉందని, ‘కె’ అక్షరంతోనే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘Project-K’ అంటే ‘కలియుగ్’ అని, టైం ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సై ఫై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది కాబట్టి ‘కలియుగ్’ కరెక్ట్ టైటిల్ అని, రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ కి ఆ టైటిల్ యాప్ట్ అయినట్లే, ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాకి ఈ ‘కలియుగ్’ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.