Prabhas : ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాయపడిన అభిమానులకి సాయమందించిన ప్రభాస్

ఇటీవల 'రాధేశ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అపశృతి దొర్లింది. చాలా రోజుల....

Prabhas : ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాయపడిన అభిమానులకి సాయమందించిన ప్రభాస్

Prabhas

Prabhas :   ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’. ‘సాహో’ వచ్చిన చాలా గ్యాప్ తర్వాత ‘రాధేశ్యామ్’ రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ‘రాధేశ్యామ్’ సినిమాని జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అపశృతి దొర్లింది. చాలా రోజుల తరువాత ప్రభాస్ సినిమా ఫంక్షన్ కావడంతో ఈ ఈవెంట్ కి ఊహించిన దానికంటే ఎక్కువ అభిమానులు వచ్చారు. దాదాపు 30 వేల మంది అభిమానులకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో కొన్ని కటౌట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈవెంట్ జరుగుతున్న సమయంలో కొంత మంది అభిమానులు ప్రభాస్ కటౌట్ మీదికి ఎక్కారు. ఇది గమనించి పోలీసులు, నిర్వాహకులు అభిమానుల్ని హెచ్చరించినా వినిపించుకోలేదు.

Harnaaj Sandhu : ప్రియాంక చోప్రా బయోపిక్‌లో నటిస్తా అంటున్న మిస్ యూనివర్స్

దీంతో ఈవెంట్ లో ఏర్పాటు చేసిన ప్రభాస్ భారీ కటౌట్ కూలిపోయింది. అక్కడ ఉన్న అభిమానులకు గాయాలయ్యాయి. కటౌట్ కూలడంతో ముగ్గురు అభిమానులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ గాయాల పాలైన అభిమానులకి ఆర్థిక సాయం అందించారని సమాచారం. ఈ విషయం తెలిసి మరోసారి ప్రభాస్ గొప్పతనాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.