MAA Elections: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైంది.. అతనికి సిగ్గు లేదు -ప్రకాష్ రాజ్

నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైందని అన్నారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.

MAA Elections: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైంది.. అతనికి సిగ్గు లేదు -ప్రకాష్ రాజ్

Prakash Raj

Prakash Raj: నేను ప్రచారం ముగించి నాలుగు రోజులైందని అన్నారు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని, మా మ్యానిఫెస్టోను మా సభ్యులకు ఇప్పడికే చెప్పినట్లు చెప్పారు ప్రకాష్ రాజ్. క్యాంప్ రాజకీయాల గురించి తెలియదని, మా సభ్యులు స్వచ్ఛందంగా ఎంచుకున్నవాళ్ళే గెలుస్తారని చెప్పారు ప్రకాష్ రాజ్.

ఇప్పటికే ‘మా’ సభ్యులు ఎవరికి ఓటెయ్యాలో డిసైడ్ అయిపోయారని, వారు ఇప్పటివరకు జరిగిన అన్నీ చూసారు.. అందరిని చూశారని, ఓటు ఎవరికి వెయ్యాలో డిసైడ్ అయ్యారని అన్నారు. ‘మా’ హిస్టరీలో ఎప్పుడూలేనంత ఓటింగ్ శాతం ఈసారి చూడబోతున్నామని అన్నారు ప్రకాష్ రాజ్.

పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరుగుతుందని, కానీ ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌‌కి సిగ్గుండాలి కదా? కట్టించుకోకూడదని తెలిసి కూడా ఒక వ్యక్తి నుంచి ఎలా డబ్బు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నట్లుగా చెప్పారు ప్రకాష్ రాజ్.