Salaar: ‘సలార్’లో ప్రశాంత్ నీల్ నింపేస్తున్నాడట!

కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్‌లను మరో లెవెల్‌లో చిత్రీకరిస్తున్నాడట.

Salaar: ‘సలార్’లో ప్రశాంత్ నీల్ నింపేస్తున్నాడట!

Prashanth Neel Loading Action Blocks In Salaar

Salaar: కేజీయఫ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Salaar Satellite Rights: ఆ ఛానల్ చేతికి సలార్ శాటిలైట్ రైట్స్..?

‘సలార్’ మూవీలో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. కాగా, ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్‌లను మరో లెవెల్‌లో చిత్రీకరిస్తున్నాడట. ఈ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7 నుండి 8 భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు పెడుతున్నాడట ఈ డైరెక్టర్. ఈ సీక్వెన్స్‌లలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటోతున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు కేజీయఫ్ మూవీని మించి ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

Salaar: సలార్ సునామీకి మరో ఏడాదే సమయం..!

ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ అవతారంలో ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 28న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.