Salaar: సలార్ సునామీకి మరో ఏడాదే సమయం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. సలార్ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Salaar: సలార్ సునామీకి మరో ఏడాదే సమయం..!

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

Salaar Shooting Update: సలార్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?

కాగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. సలార్ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు సరిగ్గా మరో ఏడాది సమయం ఉండటంతో అప్పుడే ఈ సినిమాను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు.

Salaar Movie Release Date : ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకా సంవత్సరం ఆగాల్సిందే..

ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

నాన్-స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.