Salaar Movie Release Date : ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకా సంవత్సరం ఆగాల్సిందే..

తాజగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సలార్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. సలార్ సినిమాని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్ ని కూడా..........

Salaar Movie Release Date : ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకా సంవత్సరం ఆగాల్సిందే..

salar

Salaar Movie Release Date :  రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టు K ప్రస్తుతం షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. రాధేశ్యామ్ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ 2023 సంక్రాంతికి వస్తుందని ఇటీవల ప్రకటించారు. సలార్ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఇంకా వాయిదా పడుతూ వస్తుంది. ఆదిపురుష్ సంక్రాంతికి అనడంతో దీనికంటే ముందే ప్రకటించిన సలార్ అయినా ఈ సంవత్సరం వస్తుందని భావించారు అభిమానులు.

 

తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సలార్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. సలార్ సినిమాని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. KGF లాంటి గ్రాండ్ సినిమాని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళం సూపర్ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ రామగుండం బొగ్గు గనుల పరిసరాల్లో తీశారు.

Independence Day Celebrations : సినీ సెలబ్రిటీల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు & శుభాకాంక్షలు

అయితే ఈ సినిమాని వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రకటించి సంవత్సరం పైనే అయిపోయింది. ఈ సంవత్సరంలో రిలీజ్ చేస్తా అని ప్రకటించి ఇప్పుడు మరో సంవత్సరం వాయిదా వేయడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పటికైనా రిలీజ్ అవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా చూడాలి. ప్రభాస్ ని మళ్ళీ మాస్ లుక్ లో చూడాలంటే ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)