Salaar Satellite Rights: ఆ ఛానల్ చేతికి సలార్ శాటిలైట్ రైట్స్..?
యంగ్ రెబల్ స్టార్ స్రభాస్ నటిస్తున్న ప్రెస్జీయస్ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. సలార్ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని, ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Salaar Satellite Rights Acquired By This TV Channel
Salaar Satellite Rights: యంగ్ రెబల్ స్టార్ స్రభాస్ నటిస్తున్న ప్రెస్జీయస్ ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెప్పడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Salaar: సలార్ సునామీకి మరో ఏడాదే సమయం..!
కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. సలార్ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని, ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’ సలార్ చిత్రానికి సంబంధించి అన్ని భాషల శాటిలైట్ రైట్స్‌ను చేజిక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని వసూలు చేశాయని.. దీంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ఇంకెంత వసూలు చేస్తాయా అని అభిమానుల్లో అప్పుడే ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.
Salaar Shooting Update: సలార్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?
మరి నిజంగానే సలార్ చిత్ర శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా చేజిక్కించుకుందా.. అనే విషయంపై చిత్ర యూనిట్ కానీ, స్టార్ మా ఛానల్ కానీ స్పష్టత ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. సలార్ మూవీలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.