Puri Jagannadh: నెక్ట్స్ మూవీని ఈ హీరోతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న పూరీ!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా పూరీ తన నెక్ట్స్ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ అనే సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా అటకెక్కినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Puri Jagannadh To Direct This Hero In His Next
Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఈ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా పూరీ తన నెక్ట్స్ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మరోసారి విజయ్ దేవరకొండతో ‘జనగణమన’ అనే సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా అటకెక్కినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అంతేగాక పూరీ జగన్నాధ్ నెక్ట్స్ మూవీకి సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. పూరీ తన నెక్ట్స్ మూవీని విజయ్ దేవరకొండతో చేయబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఈ సినిమాను ప్రస్తుతానికి పక్కనబెట్టాడట పూరీ. అంతేగాక స్టార్ హీరోలు ఎవరూ పూరీతో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపించడం లేదు. దీంతో పూరీ తన నెక్ట్స్ మూవీని ఓ యంగ్ హీరోతో చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
Puri Jagannadh: గాడ్‌ఫాదర్ మూవీలో పూరీ పాత్ర అదేనా?
ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. తన కొడుకు ఆకాష్ పూరీ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈసారి ఆకాష్ పూరీ కోసం తన తండ్రి ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. ఎలాంటి సబ్జెక్ట్‌తో ఆకాష్ పూరీకి అదిరిపోయే సక్సెస్ అందిస్తాడా అని పూరీ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.