Pushpa 2: పుష్పరాజ్ షురూ చేశాడు.. సుక్కు షేర్ చేశాడు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా వర్క్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

Pushpa 2: పుష్పరాజ్ షురూ చేశాడు.. సుక్కు షేర్ చేశాడు!

Pushpa 2 Starts Shooting With Allu Arjun Test Look

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా వర్క్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

Pushpa 2: బన్నీ-సుకుమార్‌ల ‘పుష్ప-2’కు ముహూర్తం కుదిరినట్లేనా..?

దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లుగా ఓ ఫోటోను షేర్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు సంబంధించి టెస్ట్ లుక్‌ను ప్రముఖ ఫోటోగ్రఫర్ అవినాష్ గోవారికర్‌తో నిర్వహించాడు దర్శకుడు సుకుమార్.

Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

ఈ క్రమంలో సెట్‌లోని వర్కింగ్ స్టిల్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ టెస్ట్ లుక్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.