Pushpa 2: బన్నీ-సుకుమార్‌ల ‘పుష్ప-2’కు ముహూర్తం కుదిరినట్లేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అబిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: బన్నీ-సుకుమార్‌ల ‘పుష్ప-2’కు ముహూర్తం కుదిరినట్లేనా..?

Pushpa 2 Movie Shooting To Launch On This Date

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అబిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: పుష్ప-2 కోసం మూడు.. దేవిశ్రీ ప్రసాద్ సెన్సేషన్!

ఇప్పటికే ఈ సీక్వెల్ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేశారు చిత్ర యూనిట్. కాగా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి జరుపుకుంటుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 20 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టాలని సుకుమార్ అండ్ టీమ్ భావిస్తోందట.

Pushpa 2: పుష్ప-2.. మరింత గ్రాండియర్‌గా రాబోతున్న పుష్పరాజ్!

ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి నిజంగానే పుష్ప-2 చిత్ర షూటింగ్ ఈసారైనా స్టార్ట్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుండగా, ఆయన సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.