PV Sindhu : ప్రభాస్ నాకు బాగా క్లోజ్.. భవిష్యత్తులో హీరోయిన్ అవుతానేమో.. నా బయోపిక్ కచ్చితంగా ఉంటుంది..

ఒలింపిక్‌ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షో ప్రోమో తాజాగా రిలీజ్ అవ్వగా ఇందులో.........

PV Sindhu : ప్రభాస్ నాకు బాగా క్లోజ్.. భవిష్యత్తులో హీరోయిన్ అవుతానేమో.. నా బయోపిక్ కచ్చితంగా ఉంటుంది..

pv sindhu

PV Sindhu :  ఒలింపిక్‌ మెడల్, ఎన్నో పతకాలు, ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తాజాగా అలీతో సరదాగా టాక్ షోకి వచ్చింది. ఈ టాక్ షో ప్రోమో తాజాగా రిలీజ్ అవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకుంది సింధు.

ఈ టాక్ షోలో అలీ.. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా చాలా మంది ఉన్నారు అంది సింధు. ఒక్కరి పేరు చెప్పు అంటే.. ప్రభాస్‌ అంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ కూడా. ప్రభాస్ నాకు క్లోజ్ అని చెప్పింది సింధు. దీంతో అలీ.. ఎందుకు సేమ్‌ హైట్‌ కాబట్టా అని అడగడంతో సింధు నవ్వేసింది.

Sonam Kapoor : పండంటి బాబుకి జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో పోస్ట్..

భవిష్యత్తులో హీరోయిన్‌ అయ్యే అవకాశం ఉందా అని అలీ అడగడంతో.. ఏమో భవిష్యత్తులో అవ్వొచ్చేమో. ఐనా నా బయోపిక్‌ కూడా ఉండొచ్చేమో, అందులో నేనే నటించొచ్చేమో అని తెలిపింది సింధు. దీంతో భవిష్యత్తులో సింధు బయోపిక్ కచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా సింధు ఎలాంటి ఆసక్తికర విషయాల్ని చెప్పిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.