Rajinikanth: ‘2.O’ కలయికతో మరో సినిమా.. రజనీకాంత్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు.. ముహూర్తం డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో ఈ సూపర్ స్టార్ ఇప్పుడు సినిమాల విషయంలో వేగం పెంచాడు. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ తో కలిసి "జైలర్" సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నాడు. ఈ కలయికలు వరుసగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

Rajinikanth: ‘2.O’ కలయికతో మరో సినిమా.. రజనీకాంత్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు.. ముహూర్తం డేట్ ఫిక్స్!

Rajinikanth two crazy projects with lyca productions

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో ఈ సూపర్ స్టార్ ఇప్పుడు సినిమాల విషయంలో వేగం పెంచాడు. ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ తో కలిసి “జైలర్” సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నాడు. ఈ కలయికలు వరుసగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

Rajinikanth: కాంతారా“పై రజిని ప్రశంసలు..

లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లను నిర్మించడంలో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తరికెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ రజనీకాంత్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులు తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 5న చెన్నైలో జరగనున్నాయి.

త్వరలోనే దర్శకుల పేర్లు అధికారికంగా వెలువడనున్నాయి. ఈ ప్రకటనలో రజనీతో పాటు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్ మరియు బ్యానర్ డిప్యూటీ చైర్మన్ ప్రేమ్ శివ స్వామి కూడా ఉన్నారు. గతంలో ఈ నిర్మాణ సంస్థ రజినీ ‘2.O’ సినిమాని నిర్మించింది. కాగా ఈ వార్త విన్న రజిని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.