Charan-Akshay : సినిమా ఫ్లాప్స్ పై స్పందించిన అక్షయ్, చరణ్.. అది మా తప్పే.. మేము కూడా రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటున్నాము..

రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి..................

Charan-Akshay : సినిమా ఫ్లాప్స్ పై స్పందించిన అక్షయ్, చరణ్.. అది మా తప్పే.. మేము కూడా రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటున్నాము..

Ram Charan and Akshay Kumar reacts on Movie Flops in Recent Times

Charan-Akshay : RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కి నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా నార్త్ లో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు చరణ్. మొన్నటివరకు RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసి ఇటీవలే ఇండియాకి వచ్చాడు చరణ్. తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వచ్చాడు.

రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు, హిందీ పాటలకి డ్యాన్సులు వేసి అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, చాలా చోట్ల టికెట్ రేట్లు పెరగటంపై కూడా ప్రశ్నలు అడగగా ఇద్దరూ సమాధానమిచ్చారు.

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ”సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే అది మా తప్పే. ఆడియన్స్ ది కాదు. మేము మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవాలి, కొత్త కథలు తేవాలి. ఆడియన్స్ తో కూడా మేము మాట్లాడాలి. కరోనా తర్వాత పరిస్థితులు మారాయి, జనాల ఆలోచనలు మారాయి. జనాలకి ఏం కావాలో మేము అర్ధం చేసుకోవాలి. జనాలు కరోనా తర్వాత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోవట్లేదు. థియేటర్స్ లో టికెట్ రేట్లు కూడా పెరిగాయి. ఇది కూడా ఒక కారణం జనాలు థియేటర్స్ కి రాకపోవడానికి. అలాగే ఫిలిం మేకింగ్ కాస్ట్ తగ్గించాలి. మేము కూడా ఖర్చులు, మా రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాలి” అని తెలిపారు.

Ram Charan : రామ్ చరణ్ సిగ్నేచర్ చూశారా??

ఇదే అంశంపై చరణ్ కూడా మాట్లాడుతూ.. ”మా సౌత్ లో కూడా పాప్ కార్న్, సమోసా రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి కథలని ఎంచుకొని చేయడానికి ట్రై చేస్తున్నాము. కథ బాగోకపోతే హీరో ఎవరైనా చూడటానికి రావట్లేదు. నేను RRR తర్వాత గెస్ట్ రోల్ లో చేసిన ఆచార్య సినిమాకి కూడా చూడటానికి జనాలు రాలేదు. కానీ మంచి కథలున్న సినిమాలకి జనాలు వస్తున్నారు. ఫిలిం మేకింగ్ కాస్ట్ తగ్గడానికి మా రెమ్యునరేషన్స్ కూడా తగ్గించుకుంటున్నాము” అని తెలిపారు. దీంతో చరణ్, అక్షయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.