Ram Charan : రామ్ చరణ్ సిగ్నేచర్ చూశారా??
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ పలువురు అభిమానులని కూడా కలిశాడు. పలువురు అభిమానులకి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సిగ్నేచర్ వైరల్ గా మారింది................

Ram Charan Signature goes viral
Ram Charan : RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. నార్త్ లో చరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొన్నటివరకు RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసి ఇటీవలే ఇండియాకి వచ్చాడు చరణ్. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి రామ్ చరణ్ రాగా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ వచ్చాడు. రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ పలువురు అభిమానులని కూడా కలిశాడు. పలువురు అభిమానులకి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సిగ్నేచర్ వైరల్ గా మారింది. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న చరణ్ ని మిస్ ఇండియా రన్నరప్ రుషాలి రాయ్ కలిసింది. చరణ్ కి తాను అభిమానిగా కలిసింది. చరణ్ తో ఫోటో తీసుకొని, ఆటోగ్రాఫ్ తీసుకొని సంబరపడింది. చరణ్ తో దిగిన ఫోటోలు, చరణ్ ఆటోగ్రాఫ్ రుషాలి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీంట్లో రుషాలికి ఆల్ ది బెస్ట్ చెప్తూ తన సిగ్నేచర్ పెట్టాడు చరణ్. చరణ్ సిగ్నేచర్ మొదటిసారి బయటకి రావడంతో చరణ్ అభిమానులు దీనిని వైరల్ చేస్తున్నారు. దీంతో పాటు రుషాలి కూడా వైరల్ గా మారింది.