Ram Charan : మరో ఘనతను అందుకున్న మెగా పవర్ స్టార్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఏ నార్త్ లో అయితే తనకు యాక్టింగ్ రాదంటూ వార్తలు రాశారో, ఇప్పుడు అదే నార్త్ మీడియా రామ్ చరణ్ నటనకు నీరాజనాలు పలుకుతున్నాయి. ఇటీవలే..

Ram Charan : మరో ఘనతను అందుకున్న మెగా పవర్ స్టార్..

Ram Charan Receiving The Future of Young India Award

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఏ నార్త్ లో అయితే తనకు యాక్టింగ్ రాదంటూ వార్తలు రాశారో, ఇప్పుడు అదే నార్త్ మీడియా రామ్ చరణ్ నటనకు నీరాజనాలు పలుకుతున్నాయి. ఇటీవలే హిందూస్తాన్ టైమ్స్ నిర్వహించే ఇండియా బిగ్గెస్ట్ లీడర్ షిప్ సమ్మిట్ లో భారతీయ సినీరంగం నుంచి చరణ్ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

Ram Charan : రోజురోజుకి రెట్టింపు అవుతున్న రామ్‌చరణ్ క్రేజ్..

తాజాగా NDTV నిర్వహించే ‘ట్రూ లెజెండ్ ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా’ కాంపిటీషన్ లో ప్రజలు వోటింగ్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియా’గా నిలిచాడు. నేడు ఢిల్లీలో ఈ అవార్డుని అందుకోనున్నాడు చరణ్. కాగా ఈ నామినేషన్ లో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్, అక్షయ్ కుమార్, సోను సూద్, తాప్సి పోటీ చేయగా చరణ్ విజేతగా నిలిచాడు.

దీంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా.. ఇటీవలే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తీ చేసుకొని వచ్చింది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, కియారా అద్వానీలా పై రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించాడట శంకర్. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.