Gandeevadhari Arjuna Trailer : గాంఢీవధారి అర్జున ఫైనల్ ట్రైలర్‌ రిలీజ్.. ఈసారి యాక్షన్‌తో..

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ‘గాండీవధారి అర్జున’ నుంచి మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చేతులు మీదుగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో..

Gandeevadhari Arjuna Trailer : గాంఢీవధారి అర్జున ఫైనల్ ట్రైలర్‌ రిలీజ్.. ఈసారి యాక్షన్‌తో..

Ram Charan releases Varun Tej Gandeevadhari Arjuna Action Trailer

Updated On : August 21, 2023 / 7:25 PM IST

Gandeevadhari Arjuna Trailer : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ లో మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. అయితే ఆ హైప్ ని మరింత పెంచేలా తాజాగా ఒక యాక్షన్ కట్ ట్రైలర్ ని విడుదల చేశారు.

Miss Shetty Mr Polishetty Trailer : పెళ్లి వద్దు గాని ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ కావాలి.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ రిలీజ్..

ఈ ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రిలీజ్ చేశాడు. ఇక ఈ ట్రైలర్ తో సినిమా కథ ఏంటో కూడా చెప్పేశారు. పెరుగుతున్న కలియుష్యం వాళ్ళ పర్యావరణం బాగా దెబ్బతింటుంది. ఇక ఆ కాలుష్యంకి సంబంధించిన ఒక నిజాన్ని ఇండియన్ పర్యావరణ పరిరక్షణ మంత్రి అంతర్జాతీయ సమ్మిట్ లో బయట పెట్టడానికి ప్రత్నిస్తుంటాడు. దీంతో విలన్స్ ఆ మంత్రిని చంపడానికి ట్రై చేస్తుంటే.. ఒక ప్రైవేట్ ఏజెన్సీలో పని చేసే హీరో ఆ మంత్రికి బాడీగార్డ్ గా వస్తాడు. చివరికి ఆ మంత్రిని కాపాడి, ప్రపంచానికి ఆ నిజాన్ని తెలియజేయడంలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేది సినిమా కథ అని తెలుస్తుంది.

Akira Nandan : అకీరా నందన్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. వెంటనే డెలీట్ చేశారు.. ఎందుకు..?

సినిమా షూటింగ్ ని దాదాపు 80 శాతం ఫారిన్ కంట్రీస్ లోనే చేశారు. ట్రైలర్ లోని యాక్షన్ స్టంట్స్ చూస్తుంటే హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలను తలిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ట్రైలర్ లోని విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.